: భారతీయ ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు గడ్డుకాలమే... హెచ్1బీ వీసాలు పొందకుండా 11 ఐటీ కంపెనీలపై నిషేధం?


ఎన్నికల ప్రచారంలో ఏదైతే మాట్లాడారో... అదే చేసే దిశగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్న కంపెనీలకు, ఉద్యోగులకు చెక్ పెడతానని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 17 సంస్థలకు హెచ్1బీ వీసాలు మంజూరు చేయకుండా... వాటిని నిషేధించే దిశగా ఆయన సమాలోచనలు చేస్తున్నారు. జనవరిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన వెంటనే తన నిర్ణయాన్ని అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ 17 కంపెనీల్లో ఇండియాకు చెందిన 11 టాప్ ఐటీ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే, మన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కలలు కరిగిపోయినట్టే. డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయినట్టే. అంతేకాదు, ఇతర కంపెనీలకు మంజూరు చేయబోయే హెచ్1బీ వీసాలకు కూడా భారీగా కోత పడబోతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News