: జయహో మోదీ.. ట్రంప్ ను వెనక్కినెట్టి టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయ‌ర్‌’గా నిలిచిన భార‌త ప్ర‌ధాని


ప్రఖ్యాత అమెరికన్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ ‘టైమ్స్‌’ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లను వెన‌క్కినెట్టి దూసుకువ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టితో రీడర్స్‌ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఇందులో మోదీ మొద‌టి స్థానంలో నిలిచారు. దీంతో ‘టైమ్స్‌’ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2016’గా ఆయ‌న మ‌రో ఘ‌న‌త సాధించారు. గ‌త ఏడాది మోదీ టైమ్స్‌ రీడర్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచారు. అయితే, ప్రధాన అవార్డు ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ మాత్రం ఆయ‌నకు అప్ప‌ట్లో ద‌క్క‌లేదు. గ‌త ఏడాది ఈ అవార్డు జర్మన్‌ చాన్సలర్‌ ఏంజిలా మోర్కెల్‌కు దక్కింది. ఈ అవార్డును ప్రతి ఏడాదీ ప్రపంచం మొత్తాన్ని అత్య‌ధికంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు ఇస్తారు.

  • Loading...

More Telugu News