: ఒత్తిడి తగ్గుతుంది.. రూ.50, 20ల కొత్త నోట్లు రాబోతున్నాయి: సీఎం చంద్రబాబు


పెద్దనోట్ల రద్దు అనంత‌రం రాష్ట్రంలో ఏర్పడిన ఇబ్బందిక‌ర‌ ప‌రిస్థితుల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్పటిక‌ప్పుడు స‌మీక్ష జరుపుతున్నారు. ఈ రోజు ఉద‌యం నగదురహిత లావాదేవీల పురోగతిపై ఆయ‌న టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారుల‌తో మాట్లాడారు. కొత్త నోట్లు వస్తే ప్ర‌జ‌ల‌పై ఉన్న‌ ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే రాష్ట్రానికి రూ. 50, రూ.20 కొత్త నోట్లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలోని రైతులు, పెన్షనర్లు ఎదుర్కుంటున్న‌ ఇబ్బందులు తొలగించడానికి ప‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News