: అమ్మకు వచ్చింది గుండెపోటు కాదు... గుండే ఆగింది!


హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్... గుండెకు సంబంధించిన అత్యంత ప్రాణాంతక పరిస్థితులను గురించి చెప్పేవే ఈ రెండు పదాలు. ఇక తమిళనాడు సీఎం జయలలితకు వచ్చింది గుండెపోటని నిన్న రాత్రి నుంచి వార్తలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఇక ఆమెకు వచ్చింది గుండెపోటు కాదని, ఆమె గుండె ఆగిందని అపోలో వైద్యులు విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేస్తోంది. ఆమెకు గుండెపోటు వచ్చినట్లయితే, 'హార్ట్ ఎటాక్' అన్న పదం న్యూస్ బులెటిన్ లో ఉండేదని, వైద్యులు 'కార్డియాక్ అరెస్ట్' అన్న పదం వాటడంతో, శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినట్టు అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిజానికి కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు చాలా తేడా ఉందని, కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే, రోగి ఉన్నట్టుండి కుప్పకూలతాడని, ఊపిరి తీసుకోకపోవడం నిలుస్తుందని, స్పందనలు ఉండవని, అదే గుండెపోటు వస్తే, గుండె కొట్టుకునే తీరు అసాధారణంగా మారుతుందని, రక్తసరఫరాకు ఆటంకం కలిగి, తద్వారా గుండెనొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు సందర్భాలూ ప్రమాదకరమైనేవని, అయితే, కార్డియాక్ అరెస్ట్ తో పోలిస్తే హార్ట్ ఎటాక్ లో కోలుకునే సందర్భాలు అధికమని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News