: లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలెను తక్షణమే రావాలని కోరిన చెన్నయి అపోలో ఆసుపత్రి
చెన్నయి అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉండడంతో లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలెను తక్షణమే ఆసుపత్రికి రావాలని అపోలో ఆసుపత్రి కోరింది. మరోవైపు జయలలిత ఆరోగ్యాన్ని హృద్రోగ, శ్వాసకోస వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ఎయిమ్స్ వైద్య బృందం కూడా అక్కడకు చేరుకొని జయలలిత ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఎయిమ్స్ వైద్య నిపుణుల టీమ్‌లో నారన్, తల్వార్, ట్రెహాన్, త్రిఖాలు ఉన్నారు. లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలె ఈ రోజు అపోలో ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.