: మోదీ చెన్నయ్ పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రధాని కార్యాలయం
చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నయికి వస్తున్నారన్న వార్తలపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, మోదీ చెన్నయ్ పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పింది. మరోవైపు పలువురు కేంద్రమంత్రులు జయలలిత ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.