: ఆయన చెప్పింది జరిగితే కనుక .. మోదీ మోదీ అని నామస్మరణ చేస్తా!: కేజ్రీవాల్
పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో అవినీతి పూర్తిగా అంతమైతే, తాను 'మోదీ మోదీ' అని మోదీ నామస్మరణ చేసేందుకు సిద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుందని అన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుని గతంలో మాదిరిగానే లావాదేవీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రోజుకు ఎన్నోసార్లు వేసుకున్న దుస్తులను మార్చే ఆయన, ప్రజలకు మాత్రం నోట్ల రద్దు కోసం త్యాగాలు తప్పవని ప్రబోధిస్తున్నారని ఎద్దేవా చేశారు. డీమానిటైజేషన్ కారణంగా కార్మికులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు తమ ఆదాయ మార్గాలను కోల్పోయారని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేసిన ఆయన, ప్రధాని మోదీతో తాను ఎన్నో విషయాల్లో విభేదిస్తున్నట్టు తెలిపారు.