: హైవేలపై భద్రత పటిష్టం, తమిళనాట 11 కంపెనీల ఆర్ఏఎఫ్ సిద్ధం... ప్రజలను సన్నద్ధం చేస్తున్న కేంద్రం!
తమిళనాడులోని అన్ని జాతీయ రహదారులు, టోల్ ప్లాజాల వద్ద సైన్యం మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలున్న చోట్ల సైన్యం బూట్ల చప్పుడు వినిపిస్తోంది. కేంద్రం నుంచి 11 కంపెనీల పారామిలిటరీ బలగాలు చెన్నై, మధురై విమానాశ్రయాలకు చేరుకోగా, వారిని త్రిచి, రామేశ్వరం, దుండిగల్, కోయంబత్తూర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నైలో స్థానిక పోలీసు బలగాలు, సీఐఎస్ఎఫ్ బలగాలకు తోడు రెండు కంపెనీల ఆర్ఏఎఫ్ మోహరించింది. జయలలిత ఆరోగ్యంపై ఎటువంటి వార్తలు వచ్చినా తట్టుకుని నిలిచే విధంగా ప్రజలను సన్నద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలస్తోంది. ఇదే సమయంలో అరాచక శక్తులకు హెచ్చరికగా, ముందే సైన్యాన్ని మోహరిస్తున్నట్టు సమాచారం.