: తమిళనాడు పరిస్థితుల నేపథ్యంలో మీ జాగ్రత్తలో మీరుండండి: ఆంధ్ర, కర్ణాటక, కేరళలకు కేంద్రం సూచన


తమిళనాడులో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కొన్ని రోజుల పాటు పక్క రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హోం శాఖ నుంచి సలహా అందింది. ఇప్పటికే తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలో కర్ణాటకకు చెందిన బస్సును దహనం చేయడంతో, తమిళనాడుకు అన్ని బస్సు సర్వీసులనూ నిలిపివేస్తున్నట్టు కన్నడ సర్కారు ప్రకటించింది. మరోవైపు ప్రస్తుతానికి నెల్లూరు చిత్తూరు రీజియన్ల నుంచి చెన్నైకి బస్సులను తిప్పుతున్నామని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను సాకుగా తీసుకుని ఆస్తుల విధ్వంసానికి ఎవరు దిగినా కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News