: అపోలో టూ పోయిస్ గార్డెన్... భద్రతా దళాల అధీనంలోకి 15 కి.మీ రోడ్డు!
అపోలో ఆసుపత్రి నుంచి జయలలిత అధికారిక నివాసం పోయిస్ గార్డెన్స్ వరకూ దాదాపు 15 కిలోమీటర్ల పొడవైన రహదారి మొత్తాన్నీ పోలీసులు, భద్రతా దళాలు తమ అధీనంలోకి తెచ్చుకోవడం చెన్నైలో కలకలం రేపుతోంది. ఈ రహదారిపైకి ఎవరూ రావద్దని, చుట్టుపక్కల ప్రజలు ఇళ్లు దాటవద్దని మైకుల్లో ఎనౌన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు అపోలో డాక్టర్లు విడుదల చేసే ఆరోగ్య బులెటిన్ లో ఎలాంటి అశుభ వార్తా ఉండరాదని అమ్మ అభిమానులు, కార్యకర్తలూ కోరుకుంటున్నారు. బులెటిన్ విడుదలకు ముందు ఎయిమ్స్ వైద్యుల సలహాను తీసుకోవాలని జయలలితకు చికిత్స చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.