: చెన్నై అపోలో చుట్టుపక్కల హోటల్స్ ను ఖాళీ చేయించిన పోలీసులు
తమిళనాడు రాజధాని చెన్నై నగరం ఏ క్షణాణ ఏం జరుగుతుందా? అన్నంత ఉత్కంఠలో ఉండగా, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాలకూ చేరుకుంటున్నారు. ఇప్పటికే అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ నూ ఖాళీ చేయించిన పోలీసులు, ఈ పరిధిలోని అన్ని షాపులనూ మూసివేయించారు. దీంతో దాదాపు 12 కిలోమీటర్ల పరిధిలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అపోలోకు దారితీసే ఏ రహదారిలోనూ వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించడం లేదు. ఎమ్మెల్యే స్థాయి, ఆపై నేతలకు మాత్రమే అపోలో వద్దకు వెళ్లే వీలు కలుగుతోంది. మిగతా చోటా నేతలు, కార్యకర్తలూ ఆసుపత్రికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది.