: మొన్న మా వాడు చెప్పింది నిజమే.. తను సంపాదించుకోలేదు!: పవన్ కల్యాణ్ పై నాగబాబు


తన దగ్గర డబ్బులు లేవంటూ, ఇటీవల ఓ బహిరంగ సభలో తన తమ్ముడు పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నిజమేనని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. తనకు కూడా కొంత డబ్బును పవన్ ఇచ్చాడని, పవన్ ఆర్థికంగా దెబ్బతిన్నాడని, వాడు డబ్బులేం సంపాదించుకోలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే పవన్ డబ్బు సంపాదిస్తున్నాడని, నాలుగైదు సినిమాలు చేసి, ఆర్థికంగా సెటిలై, ఆపై రాజకీయాల్లోకి రావాలని రెండు రంగాలనూ మేనేజ్ చేస్తున్నాడని తెలిపాడు. మోదీ తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయం పవన్ వంటి నిజాయతీ పరులకు సాయపడుతుందని నాగబాబు అభిప్రాయపడ్డారు. మోదీ తలచుకుంటే ఏదైనా చేయగలరని, రాజకీయ నేతల బినామీలపై దాడులు చేయాలని నాగబాబు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News