: జయలలిత పరిస్థితి విషమం: అపోలో ఆసుపత్రి జాయింట్ ఎండీ సంగీతారెడ్డి ట్వీట్


అపోలో అసుపత్రిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉందని, ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స చేస్తూ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఆసుపత్రి జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి గత అర్ధరాత్రి సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. తమ వైద్యులు వారి శక్తివంచన మేరకు కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. మరోవైపు జయలలిత వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా అపోలో ఆసుపత్రి ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News