: ‘అమ్మ’ ఆరోగ్యంపై కాసేపట్లో గవర్నర్ ప్రకటన!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిన విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ ఆర్.విద్యాసాగర్‌రావు చెన్నై చేరుకుని అపోలో ఆస్పత్రిని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. జయ ఆరోగ్యంపై ఆయన ప్రకటన చేస్తారని ఆస్పత్రి బయట ఎదురుచూస్తున్న వేలాదిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు భావించారు. అయితే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గవర్నర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. గవర్నర్ రాజ్‌భవన్‌కు చేరుకున్నాక ప్రకటన చేసే అవకాశముందని భావించినా ఇప్పటి వరకు రాజ్‌భవన్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే మరికొద్ది సేపట్లో ఆయన ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేయవచ్చని సమాచారం.