: తల్లి గురించి మాట్లాడుతూ యువీ కంటతడి!
తల్లి షబ్నమ్ గురించి క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. సిక్కు సంప్రదాయం ప్రకారం చండీగఢ్ లో యువీ- హాజెల్ కీచ్ ల వివాహం అనంతరం, హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో వారి వివాహం జరిగింది. ఈ సందర్భంగా యువీ తన భార్య గురించి మాట్లాడేందుకు స్టేజ్ పైకి ఎక్కాడు. అయితే, తన తల్లి షబ్నమ్ గురించి ముందుగా యువీ మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. చిన్నప్పుడే తండ్రి నుంచి తాము దూరంగా ఉండాల్సి రావడంతో, ఆ లోటు తెలియకుండానే తన తల్లి తమను పెంచిందని, ఎన్నో ఇబ్బందులు పడిందని చెప్పినప్పుడు యువీ కళ్లు చెమ్మగిల్లాయి. తనకు కేన్సర్ ఉందని తెలియగానే చాలా కుంగిపోయానని, ఆ సమయంలో తల్లి షబ్నమ్ తనకు ఎంతో ధైర్యం చెప్పిందని యువరాజ్ చెప్పాడు.