: మంత్రి సునీతను కలిసిన రాంగోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ మంత్రి పరిటాల సునీతను కలిశారు. విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన మంత్రి సునీతను వర్మ మర్యాదపూర్వకంగా కలుసుకుని క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం. పరిటాల రవి, మద్దెల చెర్వు సూరి మధ్య జరిగిన పోరు ఇతివృత్తంగా గతంలో దర్శకుడు వర్మ ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిటాల స్వగ్రామం వెంకటపురానికి వర్మ వచ్చారని, ఆ పరిచయంతో ఈ రోజు తనను కలిశారని, ఇతర విషయాలేవీ తమ మధ్య చర్చకు రాలేదని మంత్రి సునీత పేర్కొన్నారు.