: జనశక్తి డెన్ గా మారిన టీయూఎఫ్: డీఐజీ అకున్ సబర్వాల్
జనశక్తి డెన్ గా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) కార్యాలయాన్ని వాడుతున్నట్లు గుర్తించామని డీఐజీ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) కార్యాలయం సీజ్ పై ఆయన స్పందిస్తూ.. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంభరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, హైదరాబాద్ లోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు అతను తెలిపాడని చెప్పారు. ఈ సమాచారం మేరకే హైదరాబాద్ లోని టీయూఎఫ్ కార్యాలయంపై తాము ఇటీవల దాడులు నిర్వహించామన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క కేంద్ర కమిటీ సభ్యులుగా మూడు కొత్త దళాల రిక్రూట్ మెంట్ కూడా జరుగుతున్నట్లు తేలింది. తదుపరి విచారణ జరిపి మరిన్ని కేసులు నమోదు చేస్తామని, కూర రాజన్న, అమర్, విమలక్క పాత్రలపైనా విచారణ జరిపిస్తామని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు.