: ‘గబ్బర్ సింగ్’తో నా జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది: శ్రుతిహాసన్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించిన తర్వాత రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని, స్టార్ ని అయిపోయానని దక్షిణాది నటి శ్రుతిహాసన్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కల్యాణ్ తో నటించిన తర్వాత తననో స్టార్ గా గుర్తిస్తున్నారని చెప్పింది. ‘శ్రుతీనా.. ఏముందిలే’ అనుకున్న వారంతా ‘గబ్బర్ సింగ్’ తర్వాత తననో స్టార్ గా గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది. ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో తనను తీసుకోవాలనుకున్న దర్శకుడు హరీశ్ శంకర్ కి తన కృతఙ్ఞతలు చెబుతున్నానని శ్రుతి చెప్పింది.

  • Loading...

More Telugu News