: ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై పోరాడాలి: ప్రధాని మోదీ


ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై పోరాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృతసర్ లో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సులో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రఫ్ ఘనీతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ కు ప్రధాన శత్రువు ఉగ్రవాదం అని దక్షిణాసియా స్థిరత్వానికి కృషి చేయాలని, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, శాంతి అత్యంత ప్రధానాంశాలు అని, అభివృద్ధే ధ్యేయంగా మనం అడుగులు వేయాలని, ఉగ్రవాదులకు సాయం చేయడం ఏమాత్రం పనికిరాదని ఈ సందర్భంగా మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News