: నకిలీ ఐటీ అధికారుల ముఠా అరెస్టు


ఐటీ అధికారుల పేరిట ఒక వ్యక్తిని మోసగించి లక్షల రూపాయలతో ఉడాయించిన నకిలీ ఐటీ అధికారుల ముఠాను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ కు చెందిన ఒక వ్యక్తి పెద్దనోట్ల మార్పిడి చేసుకునే నిమిత్తం హైదరాబాద్ కు ఇటీవల వస్తుండగా ఆయన్ని ఆపి, రూ.9.2 లక్షల నగదుతో ఈ ముఠా ఉడాయించింది. అయితే, ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు ఆలస్యంగా లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘ఎర్రలైటు’ ఉన్న కారులో ఈ ముఠా సభ్యులు తన వద్ద ఉన్న పెద్దనోట్లను పట్టుకుపోయారని సదరు బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు కొనసాగించిన పోలీసులు, నకిలీ ఐటీ అధికారుల ముఠాను ఈరోజు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News