: ‘లేడీస్ టైలర్’ లేకపోతే నేను లేను: నటుడు రాజేంద్రప్రసాద్


‘లేడీస్ టైలర్’ సినిమా లేకపోతే తాను లేనని, ఆ చిత్రం తనకు మూలస్తంభం అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ చిత్రం విడుదలై ముప్ఫై సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా రిలీజయి 30 సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆరోజు పరిస్థితి ఏమిటంటే... దర్శకుడు వంశీకి, నాకు ఈ సినిమా ‘డూ ఆర్ డై’ లాంటిది. ఆ చిత్రం సక్సెస్ అయితేనే మేము వుంటాం.. లేకపోతే ఇక అంతే. ఒక సినిమాను అవుట్ డోర్ లో తీయడమంటే ఎంత మజా ఉంటుందనేది ఈ చిత్రం ద్వారా తెలిసింది. అలాగే, మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు నవ్వించి..నవ్వించి, చివరికి, కన్నీళ్లు పెట్టించి పంపించిన అద్భుతమైన సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో కామెడికీ ఒక ట్రెండ్ వచ్చింది’ అని నట కిరిటీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

  • Loading...

More Telugu News