: పెళ్లికి దొరకని సెలవు, ఆన్ లైన్లో వివాహం, తాళి కట్టిన ఆడపడుచు


మనసుంటే మార్గం దొరకక పోదు. వధువు ఇండియాలో, వరుడు సౌదీ అరేబియాలో ఉన్న వేళ, వివాహానికి వరుడికి సెలవు లభించకపోతే, ముహూర్తాన్ని వదులుకోవడం ఇష్టంలేని ఆ జంట ఆన్ లైన్లోనే పెళ్లి చేసుకుంది. ఈ ఘటన కేరళలో జరిగింది. కొల్లం జిల్లాకు చెందిన హారిస్ అనే యువకుడు సౌదీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. హారిస్ కు శ్యామల అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం వేళకు హారిస్ కు సెలవు లభించక, ఇండియాకు రాలేదు. దీంతో తొలుత ఆందోళన చెందినప్పటికీ, ఆఖరుకు ఆన్ లైన్లో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ నిర్ణయించాయి. ప్రత్యక్ష ప్రసారంలో హారిస్, తన జీవిత భాగస్వామిని చూస్తున్న వేళ, వరుడి సోదరి నజిత తన స్వహస్తాలతో శ్యామలకు తాళి కట్టి, ఆమెను తన వదినగా మార్చేసుకుంది.

  • Loading...

More Telugu News