: జయ తరఫున కరుణానిధిని పరామర్శించిన శశికళ!


జయలలిత ఆసుపత్రి నుంచి కదల్లేని స్థితిలో ఉన్న వేళ, కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని, జయలలిత నెచ్చెలి శశికళ పరామర్శించినట్టు తెలుస్తోంది. కరుణానిధి భార్య రాజాత్తి అమ్మాళ్ తో మాట్లాడిన శశికళ, కరుణ ఆరోగ్యంపై వాకబు చేశారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. కాగా, కరుణానిధికి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు లేవని డాక్టర్లు తేల్చారని తెలుస్తోంది. ఇక ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఎందరో అభిమానులు ఆసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. పలువురు జాతీయ స్థాయి నేతలు స్టాలిన్ తో పాటు కనిమొళిలకు ఫోన్ చేసి కరుణ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News