: రెండు గంటల నుంచి తిరుమలలో భారీ వర్షం... వెంకన్న ఆలయంలోకి చేరిన నీరు


ఈ ఉదయం 7 గంటల నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతం కావడం, రద్దీ అధికంగా ఉండటంతో భక్తుల అవస్థలు మరింత పెరిగాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లైన్లలో ఉన్నవారు కూడా తడిసేలా ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. వర్షపు నీరు శ్రీవెంకటేశ్వరుని ఆలయంలోకి చేరగా, మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News