: ఐఐటీ విద్యార్థికి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌.. కోటిన్న‌ర రూపాయ‌లు ఆఫ‌ర్ చేసిన కంపెనీ


ఐఐటీ విద్యార్థుల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తిష్ఠాత్మ‌క ఐఐటీల్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌ను ఎగ‌రేసుకుపోయేందుకు ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీలు ఎదురుచూస్తూ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ విద్యార్థుల‌కు ప‌లు కంపెనీలు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాయి. గ‌రిష్టంగా ఒక్కో విద్యార్థికి కోటిన్న‌ర రూపాయ‌లు ఆఫ‌ర్ చేశాయి. మొత్తం 8 మంది విద్యార్థుల‌కు ఈ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు ఐఐటీ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం ఇక్క‌డ జ‌రుగుతున్న క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు ఈనెల 18 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. మొత్తం 2100 మంది విద్యార్థులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ప‌లు దేశీయ ఐటీ కంపెనీలు స‌హా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, అంత‌ర్జాతీయ కంపెనీలు ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాయి.

  • Loading...

More Telugu News