: కుడికాలికి గాయం, కుట్లతో ఇంటికి చేరిన రజనీకాంత్
నిన్న రాత్రి చెన్నైలోని కేలంబాక్కం ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై '2.0' మూవీ చిత్రీకరణలో గాయపడిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను, ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు. ఆయన కుడికాలికి గాయమైందని, కుట్లు వేసి పంపామని, ఎలాంటి ప్రమాదమూ లేదని స్పష్టం చేశారు. కాగా, షూటింగ్ లో భాగంగా, ఆయనకు గాయాలయ్యాయని, ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని వేలాది మంది అభిమానులు కేలంబాక్కంలోని రజనీని తరలించిన ప్రైవేటు ఆసుపత్రి వద్దకు చేరి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.