: షూటింగ్‌లో స్వల్పంగా గాయపడిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు
రోబో 2.0 సినిమా షూటింగ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వల్పంగా గాయపడ్డారు. కీలక పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా రజనీ కాలికి స్వల్ప గాయమైంది. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. షూటింగ్‌లో రజనీకాంత్ గాయపడ్డారని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. శంకర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రోబో 2.0 సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా ఎమీ జాక్సన్ నటిస్తోంది. రూ.400 కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమా ఆసియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాగా రికార్డు సృష్టిస్తోంది.