: తెనాలిలో బంగారం దుకాణాలపై ఐటీ శాఖ దాడులు.. భయంతో షాపులు మూసేసి వెళ్లిపోయిన వ్యాపారులు


కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు తమ డబ్బును బంగారం రూపంలోకి మార్చుకొని నిల్వ చేసుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేసిన వ్యక్తులపై ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు నిఘా ఉంచారు. గుంటూరు జిల్లా తెనాలిలో బంగారం షాపుల‌పై అధికారులు ఈ రోజు భారీ ఎత్తున‌ దాడులు నిర్వహించారు. అక్క‌డి భవదీప్ జ్యూయలర్స్‌లో వారు సోదాలు చేశారు. అయితే, త‌నీఖీలు జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకున్న ఇతర బంగారం దుకాణాల‌ వ్యాపారులు త‌మ షాపుల‌ను మూసేసి ఇంటికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News