: బినామీ లావాదేవీలపై సైతం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి: మోదీ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన బీహార్ సీఎం


నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం పట్ల ఇప్పటికే పలుసార్లు సానుకూలంగా స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు మ‌రోసారి ఆ నిర్ణ‌యం మంచిదేన‌ని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ నిర్ణ‌యం అమలులో మరింత సమర్థంగా వ్యవహరించాల్సిందని అన్నారు. బినామీ లావాదేవీలపై కూడా కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న‌ నల్లధనాన్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మ‌రింత వేగంగా జ‌ర‌గాల‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News