: ‘అన్నీ రూ.2 వేల నోట్ల కట్టలే’.. రూ.46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు


దేశ వ్యాప్తంగా న‌గ‌దు కొర‌త‌తో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఎదుర్కుంటుంటే అక్ర‌మార్కుల వ‌ద్ద‌కు మాత్రం కొత్త‌నోట్లు క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా వ‌చ్చి ప‌డుతున్నాయి. త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న పోలీసులు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా దేశ వ్యాప్తంగా ల‌క్ష‌ల కొద్దీ కొత్త నోట్లు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ రోజు కర్ణాటకలోని చిక్‌మగళూరులోని జ‌యాన‌గ‌ర్ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న పోలీసులు ముగ్గురు వ్య‌క్తుల నుంచి రూ.46 లక్షల విలువైన కొత్త రూ.2000 నోట్ల క‌ట్ట‌లు స్వాధీనం చేసుకున్నారు. వారిని హెచ్‌ఎల్‌ కిరణ్‌, కుమార్‌, అరుణ్‌కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. ఆదాయ పన్ను శాఖ అధికారులతో కలిసి ఈ న‌గ‌దుని సీజ్‌ చేశామని మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News