: టీమిండియాలో త్వరలో అద్భుతమైన ఆటగాళ్లను చూడగలం: ద్రవిడ్


సమీప భవిష్యత్తులో అద్భుతమైన ఆటగాళ్లను టీమిండియాలో చూస్తామని దిగ్గజ ఆటగాడు, ఇండియా అండర్ 19, భారత్ ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. గత తరం క్రికెట్ ను శాసించిన దిగ్గజాల జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, విరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, తాను చేరతామని ద్రవిడ్ అన్నాడు. ఈ తరంలో దిగ్గజాలుగా రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ తయారయ్యే అవకాశం ఉందని చెప్పాడు. కోహ్లీని ఇప్పటికే దిగ్గజ ఆటగాడిగా పేర్కొంటున్నారని అన్నాడు. అశ్విన్ నెలకొల్పే టెస్టు రికార్డులు బద్దలు కొట్టడం చాలా కష్టమని పేర్కొన్నాడు. భవిష్యత్ లో కూడా అద్భుతమైన ఆటగాళ్లను చూస్తామని తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా కూడా కొంత మంది అద్భుతమైన ఆటగాళ్లు వెలుగు చూస్తున్నారని ద్రవిడ్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News