: వారి కుటుంబాలన్నింటికీ రూ. 10 లక్షల చొప్పున ఇవ్వండి: రేవంత్ రెడ్డి డిమాండ్


ఎంతో మంది యువకుల బలిదానాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని... అందువల్ల, డిసెంబర్ 3వ తేదీని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. అంతేకాదు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రేవంత్. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News