: ఎల్ఐసీకి రెండు కోట్ల ప్రీమియం కట్టిన బాలీవుడ్ నటుడు!
డీమోనిటైజేషన్ నిర్ణయం ఎల్ఐసీకి బాగా కలిసి వచ్చింది. ఈ నిర్ణయం ప్రకటించగానే పెద్ద మొత్తంలో ఎల్ఐసీని వినియోగదారులు ఆశ్రయించారు. జీవన్ అక్షయ్ పెన్షన్ ప్లాన్ తీసుకునేందుకు వినియోగదారులు బాగా ఆసక్తి చూపించారని ఎల్ఐసీ అధికారులు తెలిపారు. ముంబైలోని దాదర్ బ్రాంచ్ లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంతవరకు ఎవరూ కట్టనంత పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అలాగే ఒక బాలీవుడ్ నటుడు ఏటా 15 లక్షల రూపాయలు పెన్షన్ వచ్చేలా 2 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ఆదాయపుపన్ను శాఖాధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.