: జీహెచ్ఎంసీలో ఎమ్మెల్యేస్ వర్సెస్ కార్పొరేటర్స్
వార్డు కమిటీల నియామకాల నేపథ్యంలో, జీహెచ్ఎంసీ నిట్టనిలువునా చీలిపోయింది. తమ అనుచరులకు కమిటీల్లో స్థానం కల్పించుకోవాలని భావిస్తున్న కార్పొరేటర్లకు ఎమ్మెల్యేల వ్యవహారశైలి మింగుడుపడటం లేదు. కమిటీల నియామకాల్లో తమ అనుచరులకే ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తుండటంతో మ్యాటర్ సీరియస్ గా మారింది. కార్పొరేటర్లు అలకపాన్పు ఎక్కారు. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ సమావేశం కూడా ఆలస్యమవుతోంది. దీంతో, మేయర్ బొంతు రామ్మోహన్ అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. సమావేశం కాస్తా ఆలస్యం కావడంతో... బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.