: మమతా బెనర్జీపై పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆగ్రహం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యం చేపట్టిన తనిఖీలను విమర్శించేలా మాట్లాడరాదంటూ సూచించారు. సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడరాదని చెప్పారు. భారత సైన్యం గురించి ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. టోల్ ప్లాజాల వద్ద సైన్యం చేపట్టిన తనిఖీలను రాష్ట్రాన్ని అవమానిస్తున్నట్టుగా మమత అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే, తమ మోహరింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంతకు ముందే లేఖ రాసినట్టు సైన్యం చెప్పడంతో... దీదీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర గవర్నర్ మమతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.