: దేవినేని నెహ్రూతో రామ్ గోపాల్ వర్మ భేటీ
తాను తీసిన ‘వంగవీటి’ చిత్రం ఆడియో వేడుకను ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న క్రమంలో ఉదయం నుంచి విజయవాడలో పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. ఓ వైపు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమాలు చూసుకుంటూనే మరోవైపు పలువురు ప్రముఖులను కలుస్తూ వర్మ బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై చెలరేగుతున్న వివాదాన్ని తగ్గించుకునే ప్రయత్నంతో పాటు సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటున్నారు. దేవినేని నెహ్రూతో వర్మ ఎందుకు భేటీ అయ్యారన్న అంశం గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.