: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదు పేజీల బహిరంగ లేఖ రాసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఐదు పేజీల బహిరంగ లేఖను పంపారు. ఈ లేఖలో రాష్ట్రంలో నత్తనడకన కొనసాగుతున్న సంక్షేమ పథకాల గురించి వైఎస్ జగన్ వివరించారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీ తో పాటు పలు సంక్షేమ పథకాల అమలులో లోపాలున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పట్ల తీవ్రనిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్చారని, ఆ తరువాత నిధులు కూడా ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు జారీ చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఈ నెల 9న కలెక్టరేట్ల ఎదుట ఆరోగ్యశ్రీ నుంచి లబ్ధి పొందకుండా కష్టాలు అనుభవిస్తోన్న రోగులు, వారి బంధువులతో కలిసి ధర్నా చేస్తామని చెప్పారు.