: బ్యాంకుకు నగదు వచ్చిందని తెలుసుకొని దూసుకొచ్చిన ఖాతాదారులు.. తోపులాట
బ్యాంకుకు నగదు వచ్చిందని తెలుసుకున్న ఖాతాదారులు అధిక సంఖ్యలో అక్కడికి దూసుకురావడంతో తోపులాట జరిగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చోటుచేసుకుంది. పెద్దనోట్లు రద్దుచేసి 25 రోజులు గడిచినా నగదు కొరత ఉండడం, ఒకటో తారీఖున తమ ఖాతాల్లో జీతాలు పడడం, దానికి తోడు రేపు సెలవుదినం కావడంతో ఈ రోజు ఆ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకుకు ఖాతాదారుల తాకిడి అధికంగా కనిపించింది. బ్యాంకు ముందు ఖాతాదారులు ఒక్కసారిగా బారులు తీరడంతో వారిలో వారికే తోపులాట జరిగి బ్యాంకు అద్దాల మీద పడడంతో అవి పగిలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.