: రెండు కార్లలో తరలిస్తోన్న 9 కేజీల బంగారం పట్టివేత.. పదిమంది అరెస్టు
పెద్దనోట్ల రద్దు తరువాత తాము ఇన్నాళ్లూ అక్రమంగా సంపాదించి ఎవరికీ కనిపించకుండా దాచుకున్న డబ్బును కాపాడుకునే క్రమంలో నల్లకుబేరులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ డబ్బును బంగారం రూపంలో నిల్వచేసుకోవడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇటువంటి వారిపై నిఘా ఉంచిన పోలీసులు దేశ వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు మహారాష్ట్రలో పోలీసులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలో రెండు కార్లలో తరలిస్తోన్న 9 కేజీల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమంది నిందితులని అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు నిందితులు అంధేరికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారు వాడుతున్న రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.