: మోదీతో ఖతార్ ప్రధాని భేటీ


ఖ‌తార్ ప్ర‌ధానమంత్రి షేక్ అబ్దాల్లా బిన్ న‌సీర్ భారత్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు దేశ రాజ‌ధాని ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌజ్‌లో భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ఆయ‌న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధం బ‌లోపేత‌మే లక్ష్యంగా ఇరువురు ప్ర‌ధానుల మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగాయి. అనంత‌రం ప‌లు ఒప్పందాల‌పై ఇరువురి స‌మ‌క్షంలో ఖ‌తార్‌, భార‌త్ కేంద్ర మంత్రులు, అధికారులు ప‌లు ఫైళ్ల‌పై సంత‌కాలు చేసి, వాటిని మార్చుకున్నారు. ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స‌త్సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని ఇరువురు ప్ర‌ధానులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News