: వర్మ మాట్లాడతానంటేనే మేం మాట్లాడాం: వంగవీటి రాధా


సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడతానంటేనే తాము వచ్చామని వంగవీటి మోహన్ రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. భేటీ సందర్భంగా, 'వంగవీటి' సినిమాపై తమకున్న అభ్యంతరాలను వర్మకు చెప్పామని అన్నారు. సినిమాకి సంబంధించి తాము వేసిన కేసు కోర్టులో ఉందని చెప్పారు. ఈ సాయంత్రం విజయవాడలో 'వంగవీటి' సినిమా ఆడియో లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్ లో వర్మతో రంగా కుమారుడు రాధా, భార్య రత్నకుమరి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, కేఎల్ యూనివర్శిటీ ఛైర్మన్ సత్యనారాయణలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగా కలుద్దామంటేనే వర్మను రాధా కలిశారని చెప్పారు. సినిమాపై తమకున్న అభ్యంతరాలను వర్మకు రాధా చెప్పారని... ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వర్మేనని తెలిపారు.

  • Loading...

More Telugu News