: నాయకత్వ సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు అక్కడ జరగనున్న నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆయారంగాల అభివృద్ధితో దేశాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.