: కరుణానిధి మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే... స్టాలిన్ కు ఫోన్ చేసిన రజనీకాంత్
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం గురించి అతని కుమారుడు స్టాలిన్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కరుణ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా స్టాలిన్ కు ఫోన్ చేసి కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కరుణానిధి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. అలర్జీ, శ్వాససంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. మరికొన్ని రోజులు కరుణానిధి ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు.