: 30 గంటల తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ


పశ్చిమబెంగాల్ లోని టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరించడాన్ని నిరసిస్తూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నుంచి సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలోనే గడిపారు. సుమారు 30 గంటల తర్వాత నిన్న రాత్రి ఆమె తన ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇదంతా కేంద్ర ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోకపోతే... చట్టపరమైన చర్యలను తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే అంశంపై నిన్న పార్లమెంటులోని ఉభయసభలూ అట్టుడికాయి. సైన్యాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని విపక్ష ఎంపీలు విమర్శించారు. అయితే, పశ్చిమబెంగాల్ ప్రభుత్వ కోరిక మేరకే టోల్ గేట్ల వద్ద తాము తనిఖీలు చేపట్టామని... దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆర్మీ విడుదల చేసింది.

  • Loading...

More Telugu News