: ఢిల్లీని ముంచెత్తిన పొగమంచు... రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం


దేశ రాజధాని ఢిల్లీని మొన్నటివరకు వాతావరణ కాలుష్యం, దుమ్ముధూళి ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు పొగమంచు కమ్మేసింది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్నది కూడా సరిగా కనిపించని పరిస్థితి నెలికొంది. దీంతో, సిగ్నళ్లు కూడా సరిగా కనిపించడం లేదు. ఈ క్రమంలో, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 9 జాతీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-లక్నో విమాన సర్వీసు పూర్తిగా రద్దయింది. అంతేకాదు, 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 13 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్ లలో కూడా పొగమంచు దట్టంగా అలముకుంది.

  • Loading...

More Telugu News