: పురుషుడి పొట్టలో గర్భసంచి!.. హైదరాబాదులో వెలుగు చూసిన వైనం


హైదరాబాదులో ఓ ఆశ్చర్యకర విషయం వెలుగు చూసింది. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి వరిబీజం ఆపరేషన్ చేస్తుండగా... అతని పొట్టలో గర్భసంచి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన 37 ఏళ్ల ఓ వ్యక్తి వరిబీజం సమస్యతో గత నెల 23న గాంధీ ఆసుపత్రిలో చేరాడు. నిన్న అతనికి శస్త్రచికిత్సను ప్రారంభించారు. అయితే, వృషణాలు ఉండాల్సిన స్థానంలో లేవనే విషయాన్ని ఈ సందర్భంగా వైద్యులు గుర్తించారు. దీంతో, ఈ విషయాన్ని మూత్ర సంబంధిత విభాగాధిపతి డాక్టర్ జగదీష్ దృష్టికి వారు తీసుకెళ్లారు. ఆయన వచ్చి, రోగిని పరీక్షించగా... ఆయన పొట్టలో మహిళలకు ఉండే అండాశయం, గర్భసంచిలు కనిపించాయి. పురుషులు వీటిని కలిగి ఉండటాన్ని ట్రూహెర్నాప్రోడీట్ గా పిలుస్తామని వైద్యులు తెలిపారు. మళ్లీ ఓ ఆపరేషన్ నిర్వహించి వీటిని తొలగిస్తామని చెప్పారు. డాక్టర్ జగదీష్, రచ్చ రఘు, రమేష్ లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News