: అర్ధరాత్రి తనిఖీలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ లు నిన్న అర్ధరాత్రి స్వయంగా పర్యవేక్షించారు. కూకట్ పల్లి వై-జంక్షన్ నుంచి మియాపూర్ వరకు వేస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతను వారు తనిఖీ చేశారు. పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. నగరం గుండా వెళ్లే ఈ జాతీయ రహదారి అభివృద్ధికి రూ. 28 కోట్లు కేటాయించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మొన్నటి వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారైన సంగతి తెలిసింది. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ పలువురు వాహనదారులు ప్రాణాలను కూడా కోల్పోయారు.