: నోట్ల రద్దు ప్రజల ఆలోచనను మార్చలేదు.. నోబెల్ బహుమతి గ్రహీత పాల్ క్రుగ్‌మన్
నోట్ల రద్దుపై అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త ప్రొఫెసర్ పాల్ క్రుగ్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వల్ల ప్రజల ఆలోచనల్లో చెప్పుకోతగ్గ మార్పులు కనిపించే అవకాశం లేదని పేర్కొన్నారు. వారి ఆలోచనను ఇది మార్చలేదని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో మనీలాండరింగ్ లాంటి వ్యవహారాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, పక్కదారులు వెతికే పనిలో పడతారని అన్నారు. అయితే ప్రభుత్వ ఉద్దేశం మంచిదేనని, కానీ విధానం మాత్రం పెను నష్టాన్ని కలిగించేలా ఉందని అన్నారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న క్రుగ్‌మన్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్శంగా ఈ వ్యాఖ్యలు చేశారు.