: బీజేపీ నేత వద్ద రూ.20.5 లక్షల కొత్త నోట్లు.. తమిళనాడులో కలకలం
తమిళనాడులో ఓ బీజేపీ నేత నుంచి పోలీసులు రూ.20.5 లక్షల విలువైన కొత్తనోట్లు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. సేలంకు చెందిన యూత్ వింగ్ కార్యదర్శి జేవీఆర్ అర్జున్ కారులో ఈ మొత్తం దొరికింది. పొలీసులు సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరోవైపు మహారాష్ట్రలోని అంధేరీలో పాత నోట్లకు బదులు రూ.2.25 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ఘటనలో లక్ష రూపాయల పాత నోట్లు మార్చేందుకు బ్యాంకుకు వెళితే .80 వేలు కొత్త నోట్లు ఇవ్వడం పంజాబ్‌లోని బటిండాలో కలకలం రేపింది. ఈ ఘటనలో బ్యాంకు మేనేజర్ మనీశ్ భత్రీ, క్యాషియర్ గౌరవ్ గార్గ్‌లపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.