: ఉస్మానియా యూనివర్శిటీకి దక్కిన అరుదైన గౌరవం!


ఉస్మానియా యూనివర్శిటీకి అరుదైన గౌరవం దక్కింది. అభివృద్ధి చెందుతున్న 41 ప్రధాన దేశాల్లోని అత్యుత్తమ యూనివర్శిటీల్లో స్థానం దక్కించుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) బ్రిక్స్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్-2017 ర్యాంకింగ్స్ ఆఫ్ ది యూనివర్శిటీస్ ప్రకటించిన ర్యాంకుల్లో ‘ఉస్మానియా’కు 300వ ర్యాంకు దక్కింది. ఇందుకు సంబంధించిన పత్రాలను నిర్వాహకులు యూనివర్శిటీ అధికారులకు పంపారు. మొత్తం 13 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు. ప్రపంచస్థాయిలో యూనివర్శిటీ పొందిన ర్యాంకులు, బోధన, పరిశోధన వంటి పదమూడు అంశాల ఆధారంగా ఈ ర్యాంకు కేటాయించారు. మన దేశంలోని 27 యూనివర్శిటీలకు టీహెచ్ఈ బ్రిక్స్ అండ్ ఎమర్జింగ్ -2017 ర్యాంకులను దక్కించుకున్నాయి.

  • Loading...

More Telugu News